Tuesday, 28 May 2013
అరుణాచలం
అరుణాచలం తమిళనాడు రాష్ట్రము లో ఉన్నది. తిరువణ్ణామలై(తమిళనాడు)లో తేజోలింగము ఉంది . ఈ స్వామిని "అరుణాచలే్శ్వర స్వామి" అనిపిలుస్తారు. తేజోరూపాన వెలసిన అరుణాచలేశ్వరుడు అగ్నికి ప్రతీక.
ఈ క్షేత్రాన్ని భూమికి హృదయ భాగంగా చెప్పుకుంటారు. సృష్టి , స్థితి కారకులైన బ్రహ్మ విష్ణువులు ఒకసారి తమలో తాము ' ఎవరు గొప్ప ' అన్న విషయమై వాదించుకుంటుండగా ఆ సంవాదాన్ని నివారించేందుకు శివుడు తేజోలింగ రూపంగా వెలసింది ఇక్కడే అని స్థలపురాణం(అదే మహాశివరాత్రి పర్వదినానికి మూలం).అప్పుడు శివుడు ఏటా కార్తీకమాసంలో అగ్ని లింగంగా దేవతలకు దర్శనమిస్తానని వరమిచ్చారట. అందుకు గుర్తుగా ఏటా తమిళకాలం ప్రకారం కార్తీకమాసంలో ఇక్కడ దీపోత్సవం జరుపుతారు.
ఈ క్షేత్రాన్ని భూమికి హృదయ భాగంగా చెప్పుకుంటారు. సృష్టి , స్థితి కారకులైన బ్రహ్మ విష్ణువులు ఒకసారి తమలో తాము ' ఎవరు గొప్ప ' అన్న విషయమై వాదించుకుంటుండగా ఆ సంవాదాన్ని నివారించేందుకు శివుడు తేజోలింగ రూపంగా వెలసింది ఇక్కడే అని స్థలపురాణం(అదే మహాశివరాత్రి పర్వదినానికి మూలం).అప్పుడు శివుడు ఏటా కార్తీకమాసంలో అగ్ని లింగంగా దేవతలకు దర్శనమిస్తానని వరమిచ్చారట. అందుకు గుర్తుగా ఏటా తమిళకాలం ప్రకారం కార్తీకమాసంలో ఇక్కడ దీపోత్సవం జరుపుతారు.
రమణీయ అరుణ కాంతులు
శ్రీరమణులు మూర్తిమంతమైన మహర్షి. అరుణాచలం చేరిన తొలి సంవత్సరాలలో మౌనంగానే ఉండేవారు. గణపతి ముని రాకతో మౌనం వీడారు. శ్రీరమణు ఉపదేశం ఋషి వాక్కులాగే ఉండేది. అధ్వైతసారాన్నీ, ఉపనిషత్తుల మహావావ్యాలను బోధామృతంగా జగత్తున కందించారు. ‘నిరాధారుడై, గగన సమానుడై, పూర్ణుడై, నిశ్శబ్ధమై, గురు స్వరూపమై వెలిగే పరబ్రహ్మము శ్రీరమణ మహర్షి. అరుణగిరి నెలవుగా చేసుకుని డెబ్బది సంవత్సరాలు జీవించిన జీవన్ముక్తుడు, ఉపదేశకారుడు, గురువులేక గురువు శ్రీరమణ మహర్షి. వీరి గురించి, వారి మహత్వ పరిపూర్ణమైన అధ్వైత సిద్ధిని గురించి చెప్పే గ్రంథాలు ఎన్నో ఉన్నారుు. దేనికదే సాటి. అన్నీ భగత్ప్రేరితాలే. శ్రీరమణుల జీవితాన్ని తమదైన కోణంలో ఎందరో భారతీయ, పాశ్చాత్యపండితులు దర్శించి తమ అనుభూతులను అందరికీ పంచి ఇచ్చారు. చాలామంది శ్రీరమణునిలో ఆదిశంకరులవారినే దర్శించారు.
Monday, 27 May 2013
మంత్రం గురించి మరింత వివరణ
“పరివర్తనను సృష్టించే”( స్ప్రిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ [ఆధ్యాత్మిక పరివర్తన])సమర్థతగలదిగా పరిగణించే ధ్వని, అక్షరం,పదం లేదా పదసమూహాన్ని మంత్రం అంటారు. మంత్రంతో సంబంధం ఉన్న సంప్రదాయం, వేదాంతాల ప్రకారం వాటి వాడుక విధాలలో మార్పులు ఉంటాయి.
భారతదేశ వేద సంప్రదాయంలో ఆవిర్భవించిన మంత్రాలు (దేవనాగరీ), తర్వాత హిందూ సంప్రదాయంలో ప్రధాన భాగంగా బౌద్ధిక మతం, సిక్కు మతం ఇంకా జైన మతంలో ప్రచలిత ఆచారాలుగా మారాయి. ప్రాచీన తూర్పు దేశ సంప్రదాయాలు మతాలలోని ఆచారాలపై ఆధారిత లేదా శాఖలైన మంత్రాల వాడుక ఇప్పుడు అనేక ఆధ్యాత్మిక ఉద్యమాలలో వ్యాపించాయి.
ఓం అక్షరం వేదాంత గూఢత్వంలో మంత్రంగా భావిచబడుతుంది.
గాయత్రి మంత్ర అంతరార్ధం – భండారు శ్రీనివాసరావు
ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం
భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
‘న గాయత్ర్యాః పరం మంత్రం నమాతు: పరదైవతం’ అన్నది జగత్ప్రసిద్ధమయిన వృద్ధవచనం
గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం లేదు.
ఆదిశంకరాచార్యులు తమ భాష్యములో ఈ మంత్ర ప్రాశస్త్యాన్ని వివరిస్తూ ‘గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ’ అని పేర్కొన్నారు. ‘గయలు’ అంటే ప్రాణములు అని అర్ధం. అలాగే ‘త్రాయతే’ అంటే కాపాడడమని భావం. కాబట్టి ప్రాణాలను రక్షించే మంత్రం గాయత్రి మంత్రమని శంకర భాష్యం.
మంత్రం ఫలించాలంటే ఈ మూడు తప్పనిసరి
ఏదైనా విషయాన్ని విన్నప్పుడు విషయం మీద ఇది వాస్తవం అని నమ్మకం ఉండాలి, దానికి ముంది ఆ విషయం చెప్పిన వ్యక్తి మీద విశ్వాసం ఉండాలి. తర్వాత ఆ విషయం ప్రతిపాదించే అంశం పై విశ్వాసం ఉండాలి. అంటే వాక్యం, వాక్య తాత్పర్యం, ఆ వాక్యాన్ని పలికిన వ్యక్తిపై ఆదరం ఉన్నట్టయితే ఆ వాక్యం సరియైన అర్థాన్ని గోచరింపజేస్తున్నట్టు. పెద్దలు ఉపదేశం చేసే మంత్రం తత్ సిద్ధిని అందించాలి అంటే మూడింటియందు తప్పని సరిగా విశ్వాసం ఉండి తీరాలి అని శాస్త్రం చెబుతుంది.
మంత్రే తత్ దేవతాయాంచ తదా మంత్రప్రదే గురౌ |
త్రిశు భక్తి సదా కార్యా సాధి ప్రథమ సాధనం ||
మంత్రే తత్ దేవతాయాంచ తదా మంత్రప్రదే గురౌ |
త్రిశు భక్తి సదా కార్యా సాధి ప్రథమ సాధనం ||
మంత్ర తంత్ర ముల ద్వారా పరిహారములు
మంత్ర సిద్ది పొంది ,అదిదేవతను,నిర్దిష్ట ఊజ ద్రవ్యాలతో,పూజించే విదానాన్నితంత్రము అంటారు .సత్పలితాలను పొందటానికి సిద్ది పొందిన గురువు అవసరము ఆదునిక కాలములో పొందే అనేకానేక అవరోదాలు దాటడానికి తంత్ర శాస్త్రం ఎంతో ఉపయోగ పడుతుంది.ఇతరులను బాదించే విదముగా మంత్రాన్ని ఉపయోగించుట మంచిది కాదు .తంత్రము లో పూజ ద్రవ్యాలు అత్యంత కీలక పాత్ర వహిస్తాయి.ఫలం ,పత్రం ,పుష్పం ,తోయం ,ఒషదులు ,దూపం,దీపం ,అక్షతలు ,జపమాల ఆసనం ,మొదలగు పూజ ద్రవ్యాలు శుచిగా శుబ్రంగా బద్రంగా ఉంచాలి .అంతే కాకుండా వివిధ పూజలకు నిర్దేసించి పూజ ద్రవ్యాలనే వాడాలి తప్ప లబ్యము కాలేదని మనమిష్టమొచిన ద్రవ్యాలను ఉపయోగించరాదు .ఆవిధంగా చేయుట వల్ల సత్పలితాలకు బదులు దుష్పలితాలే రావచును .దాని వల్ల శాస్త్రం పట్ల అపోహ ,విముఖత కలగా వచును .
మంత్రం మనల్ని రక్షిస్తుందా...!
మంత్రాలెందుకు ? అన్నది ప్రశ్న.
మనసుద్ధరించటానికి అని సమాధానం.
మనసుద్ధరించటమే కాదు. ధరించటానికీ, భరించటానికీ అని వ్యాఖ్యానం. హరించటానికి కూడా అనే భయంతో కూడినహెచ్చరిక. మంత్రాలపై సమాజంలోని అభిప్రాయాలు చూస్తే ఇవి నిజమే ననిపిస్తుంది.
అసలు మంత్రమంటే ఏమిటి?
'మననాత్ త్రాయతే ఇతి మంత్ర:' మననం వల్ల మనల్ని రక్షిస్తుంది కనుక అది మంత్రమైందని విజ్ఞుల వాక్కు
మనసుద్ధరించటానికి అని సమాధానం.
మనసుద్ధరించటమే కాదు. ధరించటానికీ, భరించటానికీ అని వ్యాఖ్యానం. హరించటానికి కూడా అనే భయంతో కూడినహెచ్చరిక. మంత్రాలపై సమాజంలోని అభిప్రాయాలు చూస్తే ఇవి నిజమే ననిపిస్తుంది.
అసలు మంత్రమంటే ఏమిటి?
'మననాత్ త్రాయతే ఇతి మంత్ర:' మననం వల్ల మనల్ని రక్షిస్తుంది కనుక అది మంత్రమైందని విజ్ఞుల వాక్కు
నాయన గురించి వెలువడిన పుస్తకాలు
నాయన ( కావ్య కంఠ శ్రీ గణపతి ముని జీవిత చరిత్ర) : రచయిత : గుంటూరు లక్ష్మీకాంతం.
వాసిష్ట వైభవమ్ ( సంస్క్రుత గ్రంధం) : రచయిత : కపాలి శాస్త్రి
మహా తపస్వి : రచయిత : రావినూతల శ్రీరాములు
నాయన ( గణపతి ముని చరిత్ర) : రచయిత : పోలూరి హనుమజ్జానకీ రామశర్మ
వాసిష్ఠ కావ్య కంఠ గణపతి ముని : గ్రంథమాలా: సంపాదకులు : కె. నటేశన్ (సంస్క్రతమ్) ( 12 సంపుటాలు)
NAYANA : G. KRISHNA
JAYANTI : Kavyakantha Ganapati Muni Centenary Commemoration Volume (1978)
వాసిష్ట వైభవమ్ ( సంస్క్రుత గ్రంధం) : రచయిత : కపాలి శాస్త్రి
మహా తపస్వి : రచయిత : రావినూతల శ్రీరాములు
నాయన ( గణపతి ముని చరిత్ర) : రచయిత : పోలూరి హనుమజ్జానకీ రామశర్మ
వాసిష్ఠ కావ్య కంఠ గణపతి ముని : గ్రంథమాలా: సంపాదకులు : కె. నటేశన్ (సంస్క్రతమ్) ( 12 సంపుటాలు)
NAYANA : G. KRISHNA
JAYANTI : Kavyakantha Ganapati Muni Centenary Commemoration Volume (1978)
Tuesday, 7 May 2013
నవయుగ యోగ చక్రవర్తి - జానమద్ది హనుమచ్ఛాస్ర్తీ
భ గవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస దక్షిణేశ్వరంలో శ్రీ కాళిమాత అర్చనారతులై బాహ్య జగద్వవహారాల కతీతంగా మూల విరాట్టులా ఉండేవారు. వారి శిష్యులైన స్వామి వివేకానందులు ఉత్సవ మూర్తిలా విశ్వవిహారం చేసి తమ గురుదేవుల సందేశాన్ని ప్రపంచానికి అందేచేశారు.
అట్లే తిరువణ్ణామలై లోని అరుణాచల గుహలలో అజ్ఞాతంగా తపస్సాధనామగ్నులై వౌనస్వామిగా పిలువబడుతూ ఉండిన మహాతపస్వి వెంకట రామన్‌గారి ఆధ్యాత్మిక సిద్ధులను అర్థం చేర్చుకొని వారిని రమణ మహర్షిగా లోకానికి పరిచయం చేసిన అయ్యల సోమయాజుల వాసిష్ఠ గణపతి ముని.
వివేకానందులవలె గణపతిమునిగా మహుముఖ ప్రజానిధి. వేదశాస్త్ర కావ్యాలంకార ప్రవీణులు, ఆశుకవితా చతురులు, అష్టావధాన విద్యావారధులు, జ్యోతిషశాస్త్ర విశారదులు. దేశభక్తి ప్రపూర్ణులైన త్యాగధనులై భగవాన్ రమణులచే ‘నాయనా’ అని పిలువబడిన మహామనీషి కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని.
అట్లే తిరువణ్ణామలై లోని అరుణాచల గుహలలో అజ్ఞాతంగా తపస్సాధనామగ్నులై వౌనస్వామిగా పిలువబడుతూ ఉండిన మహాతపస్వి వెంకట రామన్‌గారి ఆధ్యాత్మిక సిద్ధులను అర్థం చేర్చుకొని వారిని రమణ మహర్షిగా లోకానికి పరిచయం చేసిన అయ్యల సోమయాజుల వాసిష్ఠ గణపతి ముని.
వివేకానందులవలె గణపతిమునిగా మహుముఖ ప్రజానిధి. వేదశాస్త్ర కావ్యాలంకార ప్రవీణులు, ఆశుకవితా చతురులు, అష్టావధాన విద్యావారధులు, జ్యోతిషశాస్త్ర విశారదులు. దేశభక్తి ప్రపూర్ణులైన త్యాగధనులై భగవాన్ రమణులచే ‘నాయనా’ అని పిలువబడిన మహామనీషి కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని.
కావ్యకంఠ గణపతి ముని (1878-1936) : ఒక నవయువకుని నవద్వీప విజయం - పప్పు నాగరాజు
అది 1900 సంవత్సరం, జూన్ నెల. దేశం నలుమూలలనుంచీ కవులూ, పండితులూ ఉత్సాహంగా, ప్రతిసంవత్సరం జరిగే పండిత సభలలో పాల్గొనడానికి కాశీ దగ్గరున్న నవద్వీపం చేరుకొన్నారు. అమరావతి, నలందా, ఉజ్జయిని, నవద్వీపం మనదేశంలో అతి ప్రాచీనకాలం నుంచీ పేరుగడించిన విద్యాపీఠాలు. సకల శాస్త్రాలు అక్కడ బోధించేవారు. సరస్వతికి నాలుగు ముఖాలైన – పండితులు, కవులు, శాస్త్రవేత్తలు, తత్వవేత్తలతో ఈ నాలుగు నగరాలు ఎప్పుడూ కళకళల్లాడుతూ ఉండేవి. కాలక్రమంలో అమరావతి, నలందా, ఉజ్జయిని తమ పూర్వ ప్రాభవాన్ని కోల్పోయినప్పటికీ, నవద్వీపం మాత్రం అప్పటికింకా ఉత్తరదేశంలో కాలు నిలదొక్కుకోగలిగింది. అక్కడి హరిసభలో ప్రతి సంవత్సరం పండిత పరీక్ష సభలు జరిగేవి. ఈ పరీక్షలో నెగ్గినవారికి, వారి పాండిత్యానికి తగ్గట్టు బిరుదునిచ్చి సత్కరించేవారు. అప్పటికి, ఈ సభలకి దక్షిణ దేశం నుంచీ ఎవరూ పెద్దగా వచ్చేవారు కాదు. దక్షిణాది వాళ్ళంటే నవద్వీపవాసులకి కొంచెం చిన్నచూపు కూడా.
సిద్ధ యోగి పుంగవులు : స్వర్ణ సిద్ధ యోగి వాసిష్ఠ గణపతి ముని
స్వర్ణ సిద్ధ యోగి వాసిష్ఠ గణపతి ముని
ఆయన చదవని శాస్త్రం లేదు ,రాయని కావ్యం లేదు ,దర్శించని క్షేత్రం లేదు ,తపస్సు చేయని ప్రదేశం లేదు ,చూపని మహిమలు లేవు,,ప్రసన్నం చేసుకొని దేవత లేదు అన్నిటికి మించి అస్ప్రుస్యతనుయేవగించుకొన్న సదాచార సంపన్నుడు ,భారత జాతీయ స్వాతంత్ర ఉద్యమం లో ముందు నిలిచినకర్మిష్టి ,భగవాన్ రమణ మహర్షి చేతనే ‘’నాయనా ‘’అని పించుకొన్న అద్భుత మూర్తి .సాక్షాత్తు గణపతి అవతారమే శ్రీ వాసిష్ఠ గణ పతి ముని .వారి జీవితం అంతా పరోప కారమే .కారణ జన్ములాయన .ఆ పేరు స్మరిస్తే చాలు సర్వ పాప హారం .
జననం –విద్యా భ్యాసం –వివాహం
తెలుగువారు - మంత్రసిద్ధితో వెలుగు వారు --ప్రఖ్య మధు బాబు
మంత్ర సిద్ధులుగా, మహా యోగులుగా ఖ్యాతి గాంచిన మహాత్ములు ఎందరో ! అందులో ప్రసిద్ధులైన తెలుగువారు సాధించిన విజయాలు మనకి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలగచేస్తాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీ త్రిలింగ స్వామి వారు కాశీలో వుండేవారు. రామకృష్ణ పరమహంస నుంచి మొదలుకొని ఎందరో మహానుభావుల మన్ననలను పొందిన శ్రీ త్రిలింగ స్వామి వారు ఒక అవధూతగా, అఘోరిగా, సాక్షత్ శివరూపులుగా ఎందరికో తెలుసు. వారు మూడు వందల సంవత్సరాలుగా పైగా కాశీలో జీవించినట్లు ప్రతీతి. జగత్సర్వం భవన్మయంగా దర్శించిన ఈ మహాత్ములు తెలుగువారు. ఆంధ్రప్రదేశ్ 'త్రిలింగ దేశం 'గా ఖ్యాతిగాంచినందున వారిని కాశీలో 'త్రిలింగ స్వామి ' గా పిలిచేవారు.
సామరస్యం ఆయన ఆరోప్రాణం
''స్త్రీల స్వాతంత్య్రాన్ని హరించటం, వర్ణ భేదాలు, పంచముల దైన్యస్థితి, వేదాల అర్థాన్ని సక్రమంగా తెలుసుకోకపోవడం నేటి ప్రధాన సమస్యలు. వీటిని పరిష్కరించటం ద్వారా భారతదేశాన్ని తిరిగి వైభవ స్థితికి తీసుకువెళ్ళగలం'', అంటూ 'ఇంద్రాణి సప్తశతి'లో ప్రముఖ పండితులు కావ్యకంఠ వసిష్ఠ గణపతి ముని పేర్కొన్నారు.
శ్రీ గణపతిముని బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆధ్యాత్మిక రంగంలో ఆయన గొప్పయోగి, సిద్ధపురుషుడు, ధార్మిక రంగంలో వేదకాలపు ఋషులకు దీటైనవాడు. విద్యారంగంలో, కవిత్వ పాండిత్యాల్లో సమ కాలీనుల్లో సాటిలేని మేటి, ఏకసంథ్రాగ్రాహి, సామాజిక రంగంలో విప్లవకరమైన మార్పులకు దోహద పడిన వాడు. వీరిని సాక్షాత్తు గణపతి అంశగా సాధకులు భావిస్తారు.
శక్తి స్వరూపిణి ఇంద్రాణి ( ఇంద్రాణీ సప్తశతి 17)
అనుష్ట్భుం శతకం అనేది ఇంద్రాణీ సప్తశతిలోని మూడవ శతకం. పథ్యావక్త్ర, మాణవక, చిత్రపదా, నారాచికా అనే 4 స్తబకాలు కలిసి అనుష్ట్భుం అనే శతకం అవుతుంది. ఈ శతకంలో తొలి స్తబకం పేరు పథ్యావక్త్ర స్తబకము. ఇందులో ‘‘మహాశక్తి అయిన ఇంద్రాణీదేవి మందహాసం మా భ్రమలను తొలగించుగాక!’’ అంటూ నాయన శతకాన్ని ఆరంభిస్తాడు.
3. అనుష్ట్భుం శతకమ్- 1. పథ్యావక్త్ర స్తబకము
1. హసితం తన్మహాశక్తే రస్మాకం హరతు భ్రమం
యత ఏవ మహచ్చిత్రం విశ్వ మేత ద్విజృంభతే॥
మహాశక్తి అయిన ఇంద్రాణీదేవి మందహాసం మా భ్రమలను తొలగించుగాక! ఎందుకంటే, గొప్పదైన, చిత్రమైన ఈ విశ్వాన్ని ప్రకాశింపజేసేది ఈ మంద హాసమే.
3. అనుష్ట్భుం శతకమ్- 1. పథ్యావక్త్ర స్తబకము
1. హసితం తన్మహాశక్తే రస్మాకం హరతు భ్రమం
యత ఏవ మహచ్చిత్రం విశ్వ మేత ద్విజృంభతే॥
మహాశక్తి అయిన ఇంద్రాణీదేవి మందహాసం మా భ్రమలను తొలగించుగాక! ఎందుకంటే, గొప్పదైన, చిత్రమైన ఈ విశ్వాన్ని ప్రకాశింపజేసేది ఈ మంద హాసమే.
జాతి సముద్ధరణకు పరితపించిన కావ్యకంఠ వాశిష్ఠ గణపతి ముని
శ్రీకావ్య కంఠ వాసిష్ఠ గణపతి ముని(నాయన) రమణ మహర్షిని ఆస్తిక లోకానికి పరిచయం చేసి మహోపకారాన్ని చేశారు. వీరు కడు మేధావులు. వంగదేశం (బెంగాల్)లోని నవద్వీప నగరంలో పాండిత్య పరీక్షల కోసం జరిగే పండిత సభలో పండితులందరినీ అబ్బురపరిచే రీతిలో నాయన తన ప్రతిభను చూపారు. అక్కడ ఒక వృద్ధ పండితుని చూసి ఎవరీయన అని తన పక్కన వారిని నాయన అడిగారట. ‘‘అతడే పరీక్షాధికారి, ఆశుకవి, అంబికాదత్తుడు’’ అని బదులిచ్చాడట పక్కనున్న వ్యక్తి. ఇంతలో అంబికాదత్తుడే వచ్చి, ‘‘నేను ఆశుకవితా జనకుడను, గౌడుడను. నా పేరు అంబికాదత్తు’’ అని సంస్కృతంలో చెప్పగా, దానికి నాయన ఏమాత్రం తడబడకుండా, ‘‘నేను కవికులానికి అధిపతిని. అతిదక్షుడను. దాక్షిణాత్యుడను. నా పేరు గణపతి’’ (నీవు కేవలం అంబికకు దత్తుడవు మాత్రమే. నేను సాక్షాత్తూ అంబికకు పుత్రుడను అని నాయన చేసిన చమత్కారం అంబికా దత్తుడికి నాయన పాండిత్య ప్రతిభ తెలియకనే తెలిసింది) అని సంస్కృతంలోనే జవాబిచ్చారు. ఆ తరువాత ఆ సభ పెట్టిన పరీక్షలన్నిటిలోనూ నాయన తన ప్రతిభ చాటి, తన అసమాన ప్రతిభతో అందరినీ ముగ్ధుల్ని చేశారు. ఆనాటి అచటి విద్వత్పరిషత్తు నాయనకు కావ్య కంఠ బిరుదునిచ్చి సత్కరించింది. ఇది 20.06.1900 నాడు జరిగిన సంఘటన. అలా నాయన, పండితుల మహాసభలో తన అసమాన ప్రతిభను కనబరిచి ‘‘కావ్యకంఠ’’ బిరుదును పొందారు. కావ్యకంఠ గణపతిగా ప్రసిద్ధికెక్కారు.
సర్వులకు అభయంకరి ..ఇంద్రాణి
భారత జాతి సముద్ధరణకు శ్రీ కావ్యకంఠ వాశిష్ఠ గణపతి ముని నిత్యమూ లోలోపలే పరితపించేవారు. మన దేశం, మన జాతి సర్వారిష్టాలనుండి ముక్తి పొందాలనీ, పొందుతుందనీ చెప్పారు. దానికోసం ఈశ్వరానుగ్రహాన్ని పొందడానికి తన తప్ఫఃలాన్ని ధారపోయడానికి ఆయన సిద్ధపడిన రీతి పలువురిని ఆకర్షించింది. ఎందరికో ఆయన మంత్ర దీక్షనిచ్చారు. కొందరు శిష్యుల ప్రార్థన మేరకు ‘‘ఉమాం వందేమాతరం’’ అనే మంత్రాన్ని ఉపదేశించారు.
Subscribe to:
Posts (Atom)