సర్వులనూ కాపాడే తల్లివి నీవే

 
- బార్హతం శతకంలోని రెండవదైన భుజగశిశుభృతా స్తబకములోని శ్లోకాలనుచూద్దాం.
1. మరుదధిప మనోనాధా మధుకర చికురాస్మాకం
వృజిన విధుతి మాధత్తాం విశద హసిత లేశేన॥
తుమ్మెదల్లాంటి ముంగురులున్న ఇంద్రాణీదేవి తన నిర్మలమైన చిరునవ్వుతో మా పాపాలను నాశనం చేయుగాక!
2. అఖిల నిగమ సిద్ధాంతో బహు మునివర బుద్ధాంతః
సుర పరిబృఢ శుద్ధాంతో భరత వసుమతీ మవ్యాత్॥
అన్ని వేదాలూ పొగిడినదీ, అనేక మునులు తెలుసుకున్న అంతం కలదీ అయిన ఇంద్రుడి అంతఃపుర స్ర్తియైన ఇంద్రాణీదేవి ఈ భారత భూమిని రక్షించుగాక!
3. భగవతి భవతీ చేతో రతి కృదభవ దింద్రస్య
సతవ జనని సంతాన ద్రుమవన మతి రమ్యం వా॥
అమ్మా! నీవు ఇంద్రుడి మనస్సుకు హాయిని కూర్చేదానివి. నీ మనస్సుకు హాయినిచ్చే వాడు ఇంద్రుడు. రమ్యమైన కల్పక వనమే మీ ఇద్దరికీ హాయినిచ్చేదిగా అయింది.
4. పతి రఖిల యువశ్రేష్ఠః కిమపి యువతి రత్నం త్వం
వనివిహృతిషు వాంచేతో హరణ మభవ దన్యోన్యం॥
యువకులందరిలోకీ శ్రేష్ఠుడు నీ పతి. నీవో యువతీ రత్నానివి. వన విహారాల్లో మీ అన్యోన్యత మీ ఇద్దరి మనస్సులూ ఒకదానితో మరొకటి హరింపజేస్తున్నది.
5. మధుర లలిత గంభీరై స్తవ హృదయ ముపన్యాసైః
వనవిహరణ లీలయా మహరదయి దివో రాజా॥
6. కలవచన విలాసేన ప్రగుణ ముఖ వికాసేన
భువనపతి మనో హార్షీ ర్జనని వన విహారే త్వం॥
7. కనక కమల కాంతాస్యా ధవళ కిరణ వక్త్రేణ॥
అసిత జలజ పత్రాక్షీ సిత నళిన దళాక్షేణ॥
8. అళిచయ నిజధమ్మిల్లా నవజలధర కేశేన
మృదులతమ భుజావల్లీ ధృఢ తమ భుజదండేన॥
9. అమృత నిలయ బింబోష్ఠీ రుచిర ధవళ దంతేన
అతి ముకుర లసద్గండా విక చ జలజ హస్తేన॥
10. యువతి రతితరాం రమ్యా సులలిత వపుషాయూనా
భగవతి శచి యుక్తాత్వం త్రిభువన విభునేంద్రేణ॥
అమ్మా! అలా వన విహారం చేసేటపుడు ఇంద్రుడు తన మధురమైన, లలితమైన, గంభీరమైన మాటలతో నీ హృదయాన్ని ఆకర్షించాడు. నీవు నీ చక్కని మాటకారితనంతో, అంతకుమించిన గుణాలు కలిగిన ముఖ విలాసంతో ఆ ఇంద్రుని మనస్సును ఆకర్షించావు. నీవు బంగారంతో తయారైన పద్మంలాగా సొగసైన ముఖాన్నీ, నల్ల కలువ రేకుల్లాటి కళ్లనూ కలిగి ఉంటే, ఆ ఇంద్రుడు తెల్లని కాంతులీనే ముఖాన్నీ, తమ్మి రేకుల వంటి కళ్లనీ కలిగి ఉన్నాడు. నీవు తుమ్మెదల గుంపులా కనిపించే జడ కొప్పునూ అతి మృదువైన భుజాలనూ కలిగి ఉంటే, ఇంద్రుడు వర్షాకాలంలో మేఘంలాటి జుట్టునూ అతి దృఢమైన భుజ దండాలనూ కలిగి ఉన్నాడు. నీవు అమృతానికి నిలయమైన దొండపండ్లను తలపించే పెదాలనూ, అద్దాలను మించి ప్రకాశించే చెక్కిళ్లనూ కలిగిఉన్నావు. మెరిసే దంతాలతో వికసించిన పద్మంలాటి చేతులున్నవాడు ఇంద్రుడు. అత్యంత సుందరమైన యువతివై నీవు అత్యంత సుందరుడైన యువకునిలాగా ఉండే త్రిభువనాలకూ పతియైన ఇంద్రునితో కలిసి ఉన్నావు.
11. వికచ కుసుమ మందార ద్రుమ వన వరవాటీషు
విహరణ మయి కుర్వాణా మనసిజ మనుగృహ్ణాసి॥
12. తవ శచి చికు రేరాజ త్కుసుమ మమర వృక్షస్య
నవ సలిల భృతో మధ్యే స్ఫురదివ నవ నక్షత్రం॥
13. అభజత తరు రౌదార్యం విభవమపి మహాంతం సః
వికచ కుసుమ సంపత్త్యా భగవతి భజతే యస్త్వాం॥
తల్లీ, వికసించిన పూలున్న మందారపు వనంలో విహరిస్తూ నీవు ఆ మన్మథుని అనుగ్రహిస్తూ ఉన్నావు. నీ ముంగురులలో ప్రకాశించే కల్పక పుష్పం (కల్ప వృక్షానికి పూసే పూవు) కొత్త మేఘాల మధ్య ఉండి ప్రకాశించే కొత్త నక్షత్రంలాగా మెరుస్తూ శోభిస్తూ ఉంది. ఏ కల్ప వృక్షమైతే వికసించిన పూలతో నిన్ను పూజిస్తూ ఉందో, ఆ చెట్టు తన ఔదార్యాన్నీ, ఐశ్వర్యాన్నీ నీ వల్లనే పొందుతూ ఉంది. 
- వి.వి. వేంకట రమణ సెల్. 9441234429
 
 
- 03/02/2013
Source :  
http://archive.andhrabhoomi.net/content/s-2067 
 
 
 
          
      
 
  
 
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment