Pages

Tuesday, 7 May 2013

అమ్మ చిరునవ్వే చాలు


ఇంద్రాణీ సప్తశతి -11
============
ఔష్ణిహం శతకంలోనికుమార
లలితా స్తబకం లోని మిగిలిన
మూడు శ్లోకాలను, వివరణలను
తెలుసుకొందాం.

23. యదామ ముత పక్వం
మదీయ మఘ ముగ్రం
తదింద్ర కులకాంతే నివారయ
సమగ్రం॥
అమ్మా ఇంద్రాణీదేవి నేను చేసిన
పాపాలు పెద్దవై ఉన్నా వాటిని
నివారించే తల్లివి నీవే.
24. దదాతు భరతక్ష్మా విషాద
హరణాయ
అలం బలముదారా జయంత
జననీ మే॥
జయంతుని తల్లివీ, ఉదార
స్వభావురాలివీ అయిన ఓ
ఇంద్రాణీదేవీ! ఈ భరత ఖండ
విషాదాన్ని హరించడానికి నాకు
అత్యంత బలాన్నివ్వు.
25. అతీవ లలితాభిఃకుమార
లలితాభిః
ఇమాభి రమరేశ ప్రియా భజతు
మోదం॥
అతి సుందరమైన ఈ కుమార
లలితా వృత్తాల వల్ల ఇంద్రాణీదేవి
సంతోషించుగాక.
ఔష్ణిహం శతకంలోని మొదటిదైన
కుమార లలితా స్తబకం ఇక్కడితో
పూర్తి అయింది.
***
ఔష్ణిహం శతకమ్- 2.
మదలేఖా స్తబకములోని
కొన్నిశ్లోకాలను తెలుసుకొందాం.
1.పౌలోమ్యాః పరిశుభ్ర జ్యోత్య్నా
దృశ్యరుచోమే
శ్రీమంతో దరహాసాః కల్పంతాం
కుశలాయ॥
అమ్మా! ఇంద్రాణీ! పరిశుభ్రమైన
వెనె్నల వంటి కాంతులతో
ప్రకాశిస్తున్న నీ దరహాసం నాకు
క్షేమాన్ని కలిగించుగాక!
2. కారణ్యామృత సిక్తా శక్తా శక్ర
మహిష్యాః
ప్రేక్షా భారత భూమే ర్దౌర్బల్యం
విధునోతు॥
దయ అనే అమృతంతో తడిసి
శక్తివంతమైన ఇంద్రాణీ వీక్షణం ఈ
భారత భూమికి కలిగిన
దౌర్బల్యాన్ని హరించుగాక!
3. వందే నిర్జర రాజ్ఞీం
సంకల్పేసతి యస్యాః
సాధ్యాసాధ్య విచారో నైవస్యాదణు
కోపి॥
4. సంకల్ప స్తవ కశ్చి
చ్చిత్తేచేద్దివ ఈశే
స్యాదుల్లంఘ్య నిసర్గం
సిద్ధిర్నిష్ఫలతావా॥
5. మూఢోప్యుత్తమ రీత్యా సిద్ధ్యే
దధ్యయనేషు
మేధావీచ నితాంతం నైవస్యా
త్కృతకృత్యః
6. ఉత్పద్యేత మహేశ్వ
ర్యప్రాజ్ఞాదపి శాస్త్రం
యా యాన్మాతరకస్మా ద్విభ్రాంతిం
విబుధోపి॥
7. అల్పానామబలానాం
సంగ్రామే విజయస్యాత్‌
శక్తానాం బహుళానాం ఘోరాస్యా
త్పరిభూతిః॥


  • వి.వి. వేంకటరమణ సెల్. నెం. 9441234429
  •  
  • 04/11/2012
    ఆధారం : 

No comments:

Post a Comment