శ్రీరమణులు మూర్తిమంతమైన మహర్షి. అరుణాచలం చేరిన తొలి సంవత్సరాలలో మౌనంగానే ఉండేవారు. గణపతి ముని రాకతో మౌనం వీడారు. శ్రీరమణు ఉపదేశం ఋషి వాక్కులాగే ఉండేది. అధ్వైతసారాన్నీ, ఉపనిషత్తుల మహావావ్యాలను బోధామృతంగా జగత్తున కందించారు. ‘నిరాధారుడై, గగన సమానుడై, పూర్ణుడై, నిశ్శబ్ధమై, గురు స్వరూపమై వెలిగే పరబ్రహ్మము శ్రీరమణ మహర్షి. అరుణగిరి నెలవుగా చేసుకుని డెబ్బది సంవత్సరాలు జీవించిన జీవన్ముక్తుడు, ఉపదేశకారుడు, గురువులేక గురువు శ్రీరమణ మహర్షి. వీరి గురించి, వారి మహత్వ పరిపూర్ణమైన అధ్వైత సిద్ధిని గురించి చెప్పే గ్రంథాలు ఎన్నో ఉన్నారుు. దేనికదే సాటి. అన్నీ భగత్ప్రేరితాలే. శ్రీరమణుల జీవితాన్ని తమదైన కోణంలో ఎందరో భారతీయ, పాశ్చాత్యపండితులు దర్శించి తమ అనుభూతులను అందరికీ పంచి ఇచ్చారు. చాలామంది శ్రీరమణునిలో ఆదిశంకరులవారినే దర్శించారు.
జీవిత విశేషాలుఎవరికీ చెప్పలేదు. వైద్యునికోసం వెంపర్లాడలేదు. ‘చావు’ అంటే ఏమిటొడఓ తెలుసుకోవాలనుకున్నాడు. ఆ జిజ్ఞాసలో ఆతడు శరీరం వేరు, ఆత్మ వేరు అన్న ఆధ్యాత్మిక రహస్యాన్ని ఆకళింపు చేసుకున్నాడు. సచేతనమైన శరీరవ్యాపకమంతా ‘నేను’ డుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ నేను అన్న దానిపైనే కేంద్రీకరించాను. ‘మృత్యు భయం మాయమయ్యింది. ఆక్షణం నుండీ అవిచ్ఛినంగా ఆత్మలో లీనమై పోయాను’ అన్నారు శ్రీరమణులు. 1896లో ఇం ట్లో ఎవరికీ చెప్పకుండా ‘నా తండ్రిని కలుసుకోవడానికి వెడుతున్నా’నంటూ ఉత్తరం ఒకటి బల్లమీద పెట్టి ఇల్లు విడిచి అరుణాచలం చేరుకున్నాడు. తిరువ ణ్ణామలై చేరుకోగానే అరుణాచలేశ్వరుని దర్శించి తనరాకను విన్నవించు కున్నాడు. అయ్యంకుళం తటాకంలో స్నానం చేసి కట్టుకున్న పంచలో కౌపీనా నికి సరిపడే ముక్కను చింపి మిగతాది గట్టు మీద వదిలేశారు.
యజ్ఞోపవీతం తీసేశారు. అక్కడ నేలమాళిగలో ఉన్న శివలింగం ముందు ధ్యానసమాధిలోకి వెళ్ళారు. అక్కడ కొంతకాలం గడిపి తరువాత అరుణగిరిని ఆశ్రయించారు. ఆ వయస్సులో నిర్వికల్ప, నిర్వికార, నిరాధార, నిరహంకార రూపుణ్ణి చూసినవారు మౌనస్వామిగా, బ్రాహ్మణ స్వామిగా పిలిచారు. ఆ స్వామిని ఎందరో భక్తులు ఆశ్రయించారు. అలా వీరి వద్దకు వచ్చిన వారిలో ఫళనిస్వామి, సూరినాగ మ్మలు ముఖ్యులు. స్వామిని కనురెప్పలా చూసేవారు. ఆ బాల మౌని వార్త ఆనోటాఈనోటా పడి తనవాళ్ళకు తెలిసింది.వెంటనే తల్లి, అన్న, పినతండ్రి వచ్చి ఇంటికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించారు. తల్లి ఆవేదన అర్ధంచేసుకున్న రమణులు ఇసుకపై ఈ విధంగా రాసారు.
‘‘కర్త వారి వారి ప్రారబ్ధములను బట్టి జీవులను ఆడించుచుండును. జరుగవలసినది ఎవరెంత అడ్డు పెట్టిననూ జరిగే తీరును. జరుగకూడనిది ఎవరెంత ప్రయత్నించిననూ జరుగకనే ఉండును. కనుక మౌనము మహించుటయే శ్రేష్ఠము’’. తల్లికి చేసిన ఉపదేశమి. ఆమె ద్వారా ప్రపంచానికి అందించిన తొలి సందేశము .1907లో మహాతపస్వి, బహుముఖ పాండిత్యం కలిగిన కావ్యకంఠ వాశిష్ఠ గణ పతిముని భగవాన్‌ను సందర్శించారు. అదొక అపూర్వమైన సన్నివేశం. భగ వాన్ ఒక బండపై కాలుమీద కాలు వేసుకుని రక్రవర్తివలె ఆశీనులై ఉన్నారు. భగవాన్ ఒక్కసారి గణపతిముని ముఖంలోకి చూసారు. అయినా మాట్లాడ లేదు. గణపతిమునికి అర్ధం కాలేదు. ఆలోచనలో పడ్డాడు. కాసేపటికి ఆలోచన లేకుండా పోయింది. నిశ్శబ్ధం నిలిచింది. గణపతిముని సాష్టాంగనమస్కారం చేసి రెండు ప్రశ్నలు సంధించారు.
ప్ర. స్వామీ! తప్పస్సంటే ఏమిటీ?
తొలిసారిగా రమణమహర్షి మౌనం వీడి ‘‘నేను తపస్సు చేస్తున్నాను అంటాం కదా! ఆ ‘నేను’ కనుక్కోవడమే అని సమాధానం ఇచ్చారు.
ప్ర. ఎన్నో మంత్రజపాలు చేసేను కానీ, మరణ భయం నన్ను వదలడం లేదు. మరణ భయం ఎలా పోతుందీ?
ఈ మంత్రం ఎక్కడ నుంచి పుడుతున్నదో దాన్ని పట్టుకో. అప్పుడు మరణ భయం పోతుంది. అని బదులు చెప్పారు శ్రీభగవాన్.
వెంటనే ‘రమణ పంచకం’ రచించి గురుదక్షిణగా సమర్పించారు. శ్రీరమణులు ‘సరే నాయనా’ అంటూ స్వీకరించారు. నాయనా అంటే తమిళంలో గణపతి. గణపతి మునికి భగవాన్ ‘స్కందుడు’. అరుణాచలేశ్వ రుడు, ఆపీతకుచాంబా (పార్వతి), గణపతి, స్కందుడు శివకుటుంబం. అరుణాచలమే కైలాసం. అలా అరుణాచలం, శివకుటుంబం ప్రఖ్యాతి చెందింది. భగవాన్ శ్రీరమణ మహర్షి ఆధ్యాత్మిక ప్రపంచంలో శ్రీఆదిశం కరుల సమానులయ్యారు. రమణ మహర్షి పెద్దగా చదువుకోలేదు. మృత్యువును మూర్కొన్న క్షణం లో బ్రహ్మమంటే తెలియని స్థితిలో పరబ్రహ్మాన్నే అందుకున్నారు. వేద వేదాంగాలు ఆయనకు కరతలామ లకమ య్యాయి. ఆతడు బ్రహ్మవిద్యారిష్టుడు. సంస్కృతం, తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో అసమాన పాండిత్యం గడించారు. శ్రీరమణుల కవిత్వాన్ని చూసి ఆయా భాషలలోని పండితులే విస్మితులయారు.
ఒక ఉదాహరణ :- మురుగనార్ తమిళదేశంలో ప్రసిద్ధకవి, శివభక్తుడు. శివపురాణాన్ని తమిళంలోకి అనువదిచాలనుకున్నాడు. కవిత్వం ధారాళంగా సాగుతోంది. అందులో ఒక సన్నివేశం, దారుకావనంలో మునులు యజ్ఞం చేస్తుంటారు. వారిది చార్వాక సిద్ధాంతం ‘‘సత్కర్మ స్వర్గాన్నిస్తుంది. జ్ఞానం మోక్షాన్ని స్తుంది’ అని వారి నమ్మకం. ఒకానొక విచిత్ర సంఘటనతో వారిముందు పరమశివుడు ప్రత్యక్షం అవుతాడు. మునులందరూ పరమశివునికి శరణాగతులౌతారు. శివుడు వాళ్ళందరికీ జ్ఞానబోధచేయ సంకల్పించాడు. అంతవరకూ శివపురాణం అనువదించిన మురుగనార్ కవికి భగవంతుని జ్ఞానబోధను రచించడం చేతకాలేదు. శ్రీరమణ మహర్షిని గురించి విన్న అతడు, ఆయనే తరుణోపాయం చెబుతాడని అరుణాచలం చేరుకున్నాడు. భగవానుని దర్శించి తన వ్యధను మహర్షిముందు మొరపెట్టుకున్నాడు. అప్పుడు మహర్షి
హృదయ కుహుర మధ్యే బ్రహ్మమాత్రం
వ్యహమహమితి సాక్షాదాత్మరూపేణ భాతి
హృదివిశమనసాశ్వం, చిన్వతా, మజ్జితావా
పవన చలన రోధాత్ ఆత్మనిష్టా భవత్వం
అంటూ ఆశువుగా చెప్పారు. ‘నీ హృదయంలో ఉన్న ఈశ్వరుడ్ని నువ్వు చూడలేకపోతే, ఏ ఈశ్వరుణ్ణి సంకీర్తన చేయగలవు? ఏ ఈశ్వరుణ్ణి చిత్తంలో చేడగలవు? రూపాన్ని చిత్రించగలవు? అంటూ ప్రశ్నించారు. మురుగనార్ అర్ధం చేసైఉకున్నాడు. వంద పద్యాలు రాద్దామనుకున్నాడు కానీ డబ్బదిపద్యాలు మాత్రమే రాయగలిగాడు. సాధ్యంకాలేదు. అవి మహర్షే పూర్తిచేస్తే కావ్యంలో పొదుపరుస్తానని వేడుకున్నాడు. మురుగనార్ ప్రార్ధనను మన్నించిన మహర్షి ‘సరే’ అని పూర్తిచేసారు. మురుగనార్ రాసిన భాగం మాయమైంది. మహర్షిరాసిన భాగం ‘అనుభూతి’ సారంగా పేరుపెట్టి తరువాత వారే ‘ఉపదేశసారం’గా నామకరణం చేసారు. ఇది సకలవేదాల ఉపనిషత్తుల సారం.
శ్రీమద్భగవద్గీతకు భాష్యంగా చెప్తారు పెద్దలు. శ్రీ భగవాన్ హాస్య ప్రియులు వంటలు చేయడంలో మేటి. జీవకారుణ్యమూర్తి. సహజ సమాధిస్థితిలో ఉన్నా, అందరి సంశయాలకూ పరిష్కారం చూపేవారు. మతా నికీ, మతాచారాలకు అతీతతులు. సన్యాసమంటే ‘నేను’ అన్న భావాన్ని త్యజించడం. గుండు గీయించు కుని, కాషాయ వస్త్రాలు ధరించడం కాదు’ అనేవారు. మహర్షి ఉపదేశాలన్నీ ఆచరించడం చాలా సులభ మైనవి. సాధన ద్వారా సమస్యలు పరిషృ్కతం అవుతాయి. ‘‘నిన్ను నీవు ఒక్కసారి కలుసుకుని, నీ వెవ్వరివో తెలుసుకో’’ అన్న ఒక్క ఉపదేశాన్ని ఆచరణలో పెఇతే చాలు ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు పూస్తాయి. భగవాన్ శ్రీరమణ మహర్షి 1950 ఏప్రిల్ 14న శివసాయుజ్యం పొందారు.
ఆధారం : సూర్య
No comments:
Post a Comment