Pages

Tuesday 7 May 2013

శక్తి స్వరూపిణి ఇంద్రాణి ( ఇంద్రాణీ సప్తశతి 17)

అనుష్ట్భుం శతకం అనేది ఇంద్రాణీ సప్తశతిలోని మూడవ శతకం. పథ్యావక్త్ర, మాణవక, చిత్రపదా, నారాచికా అనే 4 స్తబకాలు కలిసి అనుష్ట్భుం అనే శతకం అవుతుంది. ఈ శతకంలో తొలి స్తబకం పేరు పథ్యావక్త్ర స్తబకము. ఇందులో ‘‘మహాశక్తి అయిన ఇంద్రాణీదేవి మందహాసం మా భ్రమలను తొలగించుగాక!’’ అంటూ నాయన శతకాన్ని ఆరంభిస్తాడు.
3. అనుష్ట్భుం శతకమ్- 1. పథ్యావక్త్ర స్తబకము
1. హసితం తన్మహాశక్తే రస్మాకం హరతు భ్రమం
యత ఏవ మహచ్చిత్రం విశ్వ మేత ద్విజృంభతే॥
మహాశక్తి అయిన ఇంద్రాణీదేవి మందహాసం మా భ్రమలను తొలగించుగాక! ఎందుకంటే, గొప్పదైన, చిత్రమైన ఈ విశ్వాన్ని ప్రకాశింపజేసేది ఈ మంద హాసమే.

2. రాజంతీ సర్వభూతేషు సర్వావస్థాసు సర్వదా
మాతా సర్గస్య చిత్పాయాత్ పౌలోమీ భారత క్షితం॥
సర్వ భూతాల్లోనూ, సర్వావస్థలలోనూ, అన్ని కాలాల్లో విరాజిల్లుతూ ఈ ప్రపంచానికి తల్లియైన చిత్స్వరూపిణి ఇంద్రాణీదేవి ఈ భారతదేశాన్ని రక్షించుగాక
3. ధర్మి జ్ఞానం విభోస్తత్వం ధర్మోజ్ఞానం సవిత్రి తే
వ్యవహృత్యై విభాగోయం వస్త్వేకం తత్త్వతో యువాం॥
4. ఇంద్రేశ వాసుదేవాద్వైః పదైస్సంకీర్త్యతే విభుః
శచీ శివా మహాలక్ష్మీ ప్రముఖైర్భవతీ పదైః॥
ఓ ఇంద్రాణీదేవీ! ధర్మీ భూతమైన ప్రజ్ఞానం ప్రభువైన ఇంద్రుడి తత్వం అనీ, దాని ధర్మం అనే జ్ఞానం నీ తత్వమనీ చెప్పడం కేవలం మాటల్లో చెప్పుకోడానికి సరిపోతుంది. కానీ తత్వ రీత్యా మీరిద్దరూ ఒకటే. ఆ ప్రభువైన ఇంద్రుడు, ఈశ్వరుడు, వాసుదేవుడు మొదలైన పేర్లు కలిగి ఉన్నాడు. నీవు శచీ, శివా, మహాలక్ష్మి అనే పేర్లు కలిగి ఉన్నావు.
5. అంతరం వస్తునోజ్ఞాతృ తచ్ఛక్తం పరిచక్షతే
శాఖా స్సమంతతో జ్ఞానం శక్తిం సంకీర్తయంతి తాం॥
6. అంతరస్యచ శాఖానా మైక్యం నిర్విషయ స్థితేః
విషయ గ్రహణేష్వేవ స విభాగఃప్రదృశ్యతే॥
7. స్యాదేవం విషయాపేక్షీ శాఖానామంతరస్యచ
అవిభకె్తైక రూపాణాం విభాగో హరితామివ॥
ఒక వస్తువు ఆంతర్యం జ్ఞాత. ఆ జ్ఞాతనే శక్తుడంటారు. వ్యాప్తమైన శాఖలే జ్ఞానం. దానిని శక్తి అని అంటారు (క్రియా జ్ఞానం ఒకటైతే, కర్తృజ్ఞానం ఇంకొకటి. మహిమ వ్యాప్తమయ్యే దానిని అనుసరించి జ్ఞానం ఇలా విభాగమయ్యింది). శాఖలకూ, ఆంతర్యానికీ ఒక విభాగం అనేది దాని విషయాన్నిబట్టి ఉంటుంది. విభజించడానికి వీల్లేని ఏకైక రూపాన్ని విభజించే ప్రయత్నం చేస్తే అది దిక్కులను విభజించడమే అవుతుంది (విషయస్ఫూర్తి లేనపుడు విషయ స్ఫూర్తి ఉండక మిగిలేది అవిభాజ్యమైంది).
8. లక్ష్యమంతర్వయం చక్రే ధ్యాయామో యత్ర నిష్ఠితాః
అంతరీభావత స్తస్య నాంతరంతు విలక్షణం॥
మేము నిష్ఠగా ఏ చక్రంలో (అదే మూలాధార చక్రం) అంత లక్ష్యాన్ని ధ్యానిస్తూ ఉన్నామో, దాని అంతరీభావంవల్ల మా ఆంతర్యంలో అది విలక్షణంగా ఉండటంలేదు.
9. అహంకృతే ర్వయం నానే్య యత్రాహంకృతి సంభవః
సంపద్యేతాంతరం తత్ర జ్ఞానస్య జ్ఞాతృతావహం॥
10. అంతరావర్త భూయస్త్వా దేకస్మిన్ బోధసాగరే
బోద్ధారో బహహో భూవ న్వస్తు నైవతు భిద్యతే॥
11. చిద్రూపే మాతరేవం త్వం పరస్మాద్బ్రహ్మణో యథా
నదేవి దేవతాత్మభ్యో జీవాత్మభ్యశ్చ భిద్యతే॥
ఎక్కడైతే అహంకృతి (అంటే శరీరమే నేను అనే భావం) పుడుతోందో అక్కడే దానివల్ల మేం పుడుతున్నాం. అంతే. జ్ఞానానికి జ్ఞాతృత్వాన్ని ఇచ్చే ఆంతర్యం (అభిప్రాయం, సంబంధం) అక్కడే సంభవిస్తూ ఉంది (అహంకృతి పుట్టేచోటే అహం మూలాన్ని తెలుసుకునే వారికి ఆంతర్యం కూడా తెలుస్తుంది). జ్ఞాన సముద్రం ఒక్కటే.
కానీ దానిలోని అభిప్రాయాలనే (ఆంతర్యాలనే) సుడుల బాహుళ్యంవల్ల అనేక మంది జ్ఞానులు పుడుతున్నారు. కానీ వస్తువొక్కటే. అది వేరు కాదు (సముద్రంలో ఎన్నో సుడులుండవచ్చు. వాటి ఆకారాలూ వేరేగా కన్పడవచ్చు. కానీ దానిలో ఉండేదీ సముద్రపు నీరేగానీ వేరే కాదు). ఇలా నీవు పరబ్రహ్మ మాదిరి దేవతాత్మలకన్నా, జీవత్మాలకన్నా భిన్నమైన దానివి కాదని తెలుస్తూ ఉంది.
12. సమస్త భూత బీజానాం గూఢానామంతరాత్మని
తవోద్గారోయ మాకాశో మాతస్సూక్ష్మరజోమయః॥
13. న సర్వభూత బీజాని వస్తూని స్యుః పృథక్ పృథక్‌
త్వయి ప్రాగవిభక్తాని బభూవురితి విశ్రుతిః॥
14. యథాంబ స్మతి బీజానాం ప్రజ్ఞాయా మవిశేషతః
తథాస్యా ద్భూతబీజానా మవిభక్త స్థితి స్త్వయి॥
15. నాణూని భూత బీజాని ప్రాక్సర్గాత్త్వయి సంస్థితౌ
చితిశక్త్యాకానే్యవ నిరాకారాణి సర్వదా॥
సకల భూతాల బీజాల అంతరాత్మలలో సూక్ష్మ రజోమయంగా ఉండే ఈ ఆకాశం నీవల్లనే పుట్టింది. భూత బీజ వస్తువులు వేర్వేరుగా ఏమీ లేవు. పుట్టడానికి ముందు అవి నీలోనే ఏకమై ఉండేవని శ్రుతి చెబుతోంది. ఓ అంబా, ఎట్లయితే స్మృతి బీజాల స్థితి ప్రజ్ఞానంలో విశేషం చెందడం లేదో, అదే రీతిలో భూత బీజాల స్థితి నీలో ఏకమై ఉంది. అణువుల్లా విభజించని భూతబీజాలు సృష్టికి ముందే నీలో చిత్ శక్తి రూపంలో ఉండి అన్నిరకాలుగా నిరాకారమై ఉన్నాయి.
16. అనాది చేదిదం విశ్వం స్మరణాత్తవ సర్జనం
సాదిచే దాదిమ స్సర్గో వక్తవ్యస్తవ కల్పనాత్‌॥
అమ్మా! ఈ విశ్వం అనేది అనాదిగా వున్నదని అంటే, నీ స్మృతివల్ల సృష్టి కలిగి ఉండాలి. విశ్వానికి మూలం ఉందని అంటే, అది నీ తొలి సృష్టియై ఉండాలి.
17. విధాతుం శక్నుయా త్సంవి దభూతస్యాపి కల్పనమ్‌
కల్పితస్యైకదా భూయ స్సర్జనావసరే స్మృతిః॥
పుట్టుకను కల్పించే శక్తిని కలిగింది చైతన్యం. కల్పితమైన దానిని తిరిగి సృష్టించాల్సి వస్తే అపుడు శక్తి స్మృతి రూపిణి అవుతుంది (ఒకటి కొత్తదాన్ని సృష్టిస్తే, మరొకటి పాత విశ్వ వాసనలను ధరించి వ్యక్తీకరిస్తుంది. మొదటిది కేవలశక్తి. రెండవది విశ్వ సంబంధమైన విద్యుత్తులాటి శక్తి).
18. చితే రస్మా దృశాం వీర్యం స్వప్నేచే ద్విశ్వకారణం
చితే స్సమష్టి భూతాయాః ప్రభావే సంశయః కుతః॥
19. మాత స్సమష్టి చిద్రూపే విభూతిర్భువం తవ
ఇహ వ్యష్టి శరీరేషు భాంతీ తదను పశ్యసి॥
అమ్మా! మాలాటి వారికి చిత్ బలమే కలల్లో విశ్వనిర్మాణానికి (కొత్త రూపాలను నిర్మించడానికి) కారణమైనపుడు సమష్టి భూతంగా ఉండే చిత్ ప్రభావాన్ని గురించిక సందేహపడనక్కరలేదు. అందువల్ల ఈ భువనమనేది నీ కల్పనే (విభూతియే). ఇక్కడి వ్యష్టి శరీరాల్లో ప్రకాశిస్తూ, భువనాన్ని అనుసరించి చూస్తున్నావు.
20. త్వం బ్రహ్మత్వం పరాశక్తిస్త్వం సర్వా అపి దేవతాః
త్వం జీవా స్త్వం జగత్సర్వం త్వదన్యన్నాస్తి కించన॥
21. సతీచిదంబ నైవ త్వం భావ భావ విలక్షణా
శక్తి శక్తిమతో ర్భేద దర్శనా దేష విభ్రమః॥
22. తవాంబ జగతశ్చాస్య మృత్తికా ఘటయోరివ
సంబంధో వేదితవ్యస్స్యా న్నరజ్జు ఫణి రివ॥
23. త్వం శక్తిరస్య విచ్ఛిన్నా భావై రాత్మ విభూతిభిః
అంతరాస్తు మహేంద్రస్య శక్తస్య ప్రతిబింబవత్‌॥
ఓ ఇంద్రాణీదేవీ! నీవే బ్రహ్మవు, పరాశక్తివి, సర్వదేవతా స్వరూపిణివి. జీవుల స్వరూపానివీ, సర్వజగత్తూ కూడా నీవే. నీకంటే వేరే ఏదీ లేదు. చిత్ రూపిణివైన నీవు నీ భావభావంలో భిన్నంగా లేవు. శక్తి, శక్తిమంతుడనే భేద దృష్టివల్లనే ఈ భ్రమలన్నీ కలుగుతున్నాయి. నీకు, ఈ జగత్తుకూ, మట్టికీ కుండకూ ఉండే సంబంధం లాగా ఊహించవచ్చేమో గానీ, తాడుకూ పాముకీ సంబంధమున్నట్టు (రజ్జు సర్పభ్రాంతిలాగా) ఊహించలేం. నీ ఆత్మ విభూతులే అయిన మనోభావాలతో కూడి నీవు శక్తివై ఉన్నావు. శక్తుడైన ఇంద్రుడికి ఈ విభూతులన్నీ ప్రతిబింబాల మాదిరి అంతరంలో ఉన్నాయి (మీ ఇద్దరి మనోభావాలొక్కటే అని కవి భావన).
24. శక్తిర్గణపతేః కాయే ప్రవహంతీ సనాతనీ
భారతస్య క్రియాదస్య బాధ్యమానస్య రక్షణం॥
గణపతిముని శరీరంలో ప్రవహించే సనాతనమైన ఆ శక్తి బాధపడుతూన్న ఈ భారతదేశాన్ని రక్షించుగాక!
25. ఇమాని తత్త్వవాదీని వాసిష్ఠస్య మహామునేః
పథ్యా వక్త్రాణి సేవంతా మనంతా మభవాం చితిం॥
వాసిష్ఠముని తత్వవాదాలైన ఈ పథ్యావక్త్రవృత్తాలు అనంతమైన, పుట్టుకేలేనట్టి ‘చిత్’ ను సేవించుగాక!
అనుష్ట్భు శతకంలోని మొదటిదైన పథ్యావక్త్ర స్తబకం ఇక్కడితో పూర్తి అయింది. *

  • వి.వి. వేంకట రమణ సెల్. 9441234429 
  • 16/12/2012
    ఆధారం : 
http://archive.andhrabhoomi.net/content/sekti

No comments:

Post a Comment