Pages

Monday 27 May 2013

మంత్రం మనల్ని రక్షిస్తుందా...!

మంత్రాలెందుకు ? అన్నది ప్రశ్న.
మనసుద్ధరించటానికి అని సమాధానం.

మనసుద్ధరించటమే కాదు. ధరించటానికీ, భరించటానికీ అని వ్యాఖ్యానం. హరించటానికి కూడా అనే భయంతో కూడినహెచ్చరిక. మంత్రాలపై సమాజంలోని అభిప్రాయాలు చూస్తే ఇవి నిజమే ననిపిస్తుంది.


అసలు మంత్రమంటే ఏమిటి?

'మననాత్‌ త్రాయతే ఇతి మంత్ర:' మననం వల్ల మనల్ని రక్షిస్తుంది కనుక అది మంత్రమైందని విజ్ఞుల వాక్కు


దేనినుండి రక్షిస్తుంది?

 మానవుడు ఎంత వికసనశీలియైనా, జన్మజరామృత్యుభయం అతణ్ణి అనాదిగా వెన్నాడుతూనే వుంది. 'జాతస్య హి ధ్రువో మృత్యు: ధ్రువం జన్మ మృతస్య చ' అని గాను గెద్దులాగా జీవుడు ఈ చక్రభ్రమణం చేస్తూనే ఉన్నాడు. మంత్రం అనేది మనన శీలం గల జీవితాత్కాలిక శాశ్వతావస్థాభేదాలను నిరూపించి ఈషణత్రయాన్ని క్రమంగా దూరం చేసి, పునరావృత్తి రహితమైన, త్రికాలాతీత శాశ్వత బ్రహ్మలోకాన్ని పొందేందుకు తోడ్పడుతుంది. తాత్కాలిక ప్రయోజనాలు గల అష్టసిద్ధుల వంటి వాని అనర్థాన్ని సుస్థిరంగా నిరూపించి పరతత్తావ గహానకు, తురీయ పురుషార్థ ప్రాప్తికి మంత్రాలు మార్గదర్శాలౌతాయి.


మంత్రానుష్ఠానానికి ముందు ఆ మంత్రాధిదేవతను మన ఆత్మతత్త్వంలో ఆవాహనం చేసికొని ముందుకు సాగుతాం. దీనివల్ల అనుష్ఠాతకు అవధుల కనుగుణంగా కొంత ఉద్దిష్ట ప్రయోజనం సిద్ధి స్తుంది. దేహధర్మాల ననుసరించి ఈ సాధన సాగుతుంది. కనుక అంతవరకు మనలను ధరిస్తాయన్నమాట.


కాని ఆదర్శాలెంత గొప్పగా వున్నా సాధించిన విజయాలలో ఒక్కొక్కప్పుడు మనస్సు మదంతో కదను త్రొక్కి సమాజ మారక కారణమౌతుంది. దైవదత్తమైన మేధాసంపత్తిని మేదోస్థి రక్త సంవృద్ధికీ, సమాజ పీడాకారకంగా దురుపయోగం చేసే వారిని మంత్రాధి దేవతలు తీవ్ర వైకల్యానికి గురిచేసి శిక్షించటం జరుగు తుంది. ఈ రీతి ప్రయోగవేత్తలలో ఇది అనుభవంలోని మాట. కనుక ఇలా మంత్రాలు మానవోద్ధరణ, ధారణ, భరణ, సంహరణ, కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయనుకోవచ్చును.


మంత్ర ద్రష్టలు తమకవగతమైన శక్తిని గూర్చి పరిపూర్ణమైన అనుభవం పొంది తరువాతి తరాలవారికి ఎలా ఆచరించాలో వివ రణ పూర్వకంగా అందించారు. కాని ఇందులోగల చిక్కులన్ని గమ నించిన పెద్దలు మంత్ర శాస్త్రాన్నంతటినీ, సాత్త్విక, రాజస, తామసా ర్చనా విధానాలుగా విభజించి, మానసిక పూజను సాత్త్విక మనీ, అది అందరికీ అందుబాటులో లేనిది గనుక అర్చామూర్తి విభజించి, దేహబుద్ధి ధర్మానుగుణంగా ఎవరెవరు ఏ ప్రక్రియ ననుసరించ వచ్చునో నిరూపించారు.


ఇంకొక స్థూల పరిగణన తీసుకొంటే స్త్రీ రూప దేవతారాధ నమంతా వామమనీ, పురుషు దేవతారాధకమైనవన్నీ దక్షస్థాపితాలు గనుక దక్షిణారాధనలనీ గీటుగీసి తేల్చటమేకాక, వామతామసిక, తామసిక విధానాలన్నిటిని క్షుద్రవిద్యలుగా భావించారు.వీటిలో ప్రాపంచిక భోగ్యవస్తువులకు గల ప్రాధాన్యాన్ని చూచిన పెద్దలు పరమ లౌకిక ప్రయోజనాలు గల ఈ తామసిక విద్యలను 'క్షుత్‌' విద్యలుగా (ఆకలి విద్యలు) నిర్ణయించి వుంటారు. అవి కాలక్రమాన నానార్థాలను నామధేయాలను సంతరించుకొన్నవి. కనుక నామమంతా తామసికం కాదన్నమాట.


అనాదిగా సృష్టి ధర్మాన్ని గూర్చి వస్తూన్న తాత్త్విక భావన కనుగుణంగానే ఈ మంత్ర విభజన కూడా జరిగిందా అనిపిస్తుంది. అనంతనాముడైన ఆ పురుషోత్తముని పురుషతత్త్వ ప్రతీకగాను, సకల జీవజాల హేతుభూతమైన ప్రకృతి నంతటిని స్త్ర రూప దేవతగాను ఆరాధించారన్నమాట.


మంత్ర శాస్త్రం మరొక సత్యాన్ని కూడా చాటుతున్నదేమో! సరస సమరస శోభన సృష్టిలో ఆ జగజ్జననీజనకులు అవిభాజ్య భాగధేయులనేది ఆ సత్యం.


శ్రీ చండీనవర్ణావ మంత్రద్రష్టలు బ్రహ్మ విష్ణురుద్రులనీ, శ్రీమహాకాళీ, శ్రీమహాలక్ష్మీ మహాసరస్వతులు మంత్ర దేవతలనీ, త్రిదేవ్యతీతమైన ఆ మహాశక్తికి మధుకైటభప్రశమని, మధుకైటభఘ్ని, మాహిషోన్మూ లినీ అనే ప్రశస్తులున్నవనీ ఆ మంత్రం చెబుతూంది ఇక శ్రీవిద్యా పరాషోడశాక్షరి పరాదేవతను తార్‌క్ష్యా రూఢ హరి హృదయ సరోజంలో వెలుగొందే పరమ చిత్స్యరూపిణిగా వర్ణిస్తోంది.


పురుష సత్తాక మంత్రాలలో సాత్త్విక మంత్రాలలో కూడా సవితా దేవతా, ఆదిత్యహృదయ రూపీ నారాయణోదేవతా, శనైశ్చరోదేవతా అని స్త్రీ లింగ ప్రత్యయాన్ని వాడటం కూడా నూత్నార్థాలను కల్పిస్తు న్నది. ఇది ఆదిశంకరులు చెప్పి: 'శివ: శక్త్వా యుక్తో యది భవతి శక: ప్రభవితుం' అన్నదానికి లక్ష్యభూతంగా వున్నది.


అంటే ఈ విశాల చరాచర ప్రకృతి అంతా పరమ పురుష పరా కృతుల లీలా జాలమన్నమాట. ఏ పేరుతో పిలిచినా, ఆ సుషుప్త పర మపురుష హృదయాంతరాళంలో, అనంత చైతన్యం అతిగోప్యంగా వుండి, తత్పంకల్పమాత్రాన ప్రబుద్ధమై, ప్రకృతి రూపధారిణియై విశాలసృష్టికి కారణభూతమౌతున్నదన్న మాట. ఒకే సూర్యుడు వస్తు భేదాన్ని బట్టి వివిధాకృతులలో గోచరిస్తున్నట్లుగానే పరమాత్మ ధరిం చే అవస్‌థానభేదాల కనుగుణంగా పరాశక్తి కూడా తన రూపాలను ఐశ్వర్య, జ్ఞాన, శక్తి ప్రదాత్రిగా మార్చుకుంటూ విశ్వచాలన కార్య క్రమంలో తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ వుంటుందన్నమాట.


మరి ఇది పరమపురుషుడైన వేంకటేశ్వరునకు బ్రహ్మోత్సవంగాను, పరా త్పరియైన అనంతచైతన్య శక్తికి నవరాత్రిమహోత్సవంగాను మనం తరించేందుకేర్పాటైన మహత్తర సమయం.


మానుష మనోమాలిన్యాలను మాని, దైవీసంపదను సాధించు కోవలసిన దీక్షా సమయం. నీది నాదనే నాదాల కతీతంగా తిరుమల శిఖరాల వెలసిన పుంజీభూత అనంతచైతన్యాన్ని సేవించి, ఆజ్ఞాన గంగలో మును కలిడి, మన కలిదోషాలను కడుగుకొందాం.


మహే శ్వరధ్యాన తత్పరుడై కృష్ణ కథను శ్రీరాముని కంకితం చేసిన పోతన మహాకవి అనుసరించినది కూడా ఈ అఖండ చైతన్యారాధనమే మరి!

ఆధారం : ఆంధ్రప్రభ

No comments:

Post a Comment