Pages

Tuesday 28 May 2013

అరుణాచలం

అరుణాచలం తమిళనాడు రాష్ట్రము లో ఉన్నది. తిరువణ్ణామలై(తమిళనాడు)లో తేజోలింగము ఉంది . ఈ స్వామిని "అరుణాచలే్శ్వర స్వామి" అనిపిలుస్తారు. తేజోరూపాన వెలసిన అరుణాచలేశ్వరుడు అగ్నికి ప్రతీక.

ఈ క్షేత్రాన్ని భూమికి హృదయ భాగంగా చెప్పుకుంటారు. సృష్టి , స్థితి కారకులైన బ్రహ్మ విష్ణువులు ఒకసారి తమలో తాము ' ఎవరు గొప్ప ' అన్న విషయమై వాదించుకుంటుండగా ఆ సంవాదాన్ని నివారించేందుకు శివుడు తేజోలింగ రూపంగా వెలసింది ఇక్కడే అని స్థలపురాణం(అదే మహాశివరాత్రి పర్వదినానికి మూలం).అప్పుడు శివుడు ఏటా కార్తీకమాసంలో అగ్ని లింగంగా దేవతలకు దర్శనమిస్తానని వరమిచ్చారట. అందుకు గుర్తుగా ఏటా తమిళకాలం ప్రకారం కార్తీకమాసంలో ఇక్కడ దీపోత్సవం జరుపుతారు.


25ఎకరాల విస్తీర్ణంలో 217అడుగుల ఎత్తైన 11 అంతస్తుల భారీ రాజగోపురంతో పెద్ద పెద్ద ద్వారాలతో కుండాలు ఏడు ప్రాకారాలతో బాగా ఎత్తైన ప్రదేశం నుంచి చూస్తే పెద్ద కోటలా దర్శనమిచ్చే ఆర్కిటెక్చర్ అద్భుతం అరుణాచలం ఆలయం. ప్రస్తుతమున్న గుడిని పల్లవరాజులు కట్టించారు. అంతకు ముందు ఈ నిర్మాణం గురించి చారిత్రక ఆధారాలు ఎక్కడా లేవు.

ఈ తిరువణ్ణామలై మద్రాసుకు 165కి.మీ దూరంలో ఉంది. విల్లుపురం నుంచి కాట్పాడికి వెళ్లే మార్గంలో ఉంది. విల్లుపురం నుంచి 68కి.మీ అరుణాచలం పంచభూత క్షేత్రాలలో ఒకటి. దక్షిణభారతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభుతమునకిది ప్రతీక.

ఆ పేరెలా వచ్చింది ?

అరుణాచలము అనగా అరుణ - ఎర్రని, అచలము - కొండ. ఎర్రని కొండ అని తాత్పర్యము. అ-రుణ అంటే పాపములను పరిహరించునది అని అర్ధము. తమిళం లో " తిరువణ్ణామలై " అంటారు. తిరు అనగా శ్రీ, అణ్ణామలై అనగా పెద్దకొండ అని విశ్లేషణ. ఇది చాల గొప్ప పుణ్యక్షేత్రము . స్మరణ మాత్రము చేతనే ముక్తినొసగే క్షేత్రము . కాశీ, చిదంబరము, తిరువారూరుల కంటే మిన్నయని భక్తుల విశ్వాసిస్తున్నారు.

ప్రాశస్త్యము, 

ఇది త్రిమూర్త్యాత్మకము.

ఇది భూమండలములో అన్నిప్రదేశాల కంటే పురాతనమైనదనీ, ఇది సమస్త భూమండలానికి మధ్యన ఉండి, దాని హృదయం వంటిదనీ చెప్పుకొంటారు.

శివపార్వతుల కు సంభందించిన కధ

ఒకప్పుడు పార్వతీదేవి తాను వినోదార్ధం శివుని కన్నులు మూసి గావించిన అపరాధానికి ప్రాయశ్చిత్తముగా .......... ఘోర తపస్సు చేసి శివుని అర్ధభాగం పొందిన క్షేత్రము అరుణాచలమే.

అలా పార్వతీదేవి శివుని కన్నులు మూసినప్పుడు లోకములు అంధకార నిమగ్నములైనవి. అలా తనవల్ల జరిగిన ధర్మలోపమునకు చింతించి ఆమె ....... ఇప్పుడు నేనేమి చేయవలెనని శివుని ప్రశ్నించగా .......

కరుణాళుడైన శివుడు నా స్వరూపమేయైన నీకు ప్రాయశ్చిత్తమెందులకు ? ఐనను ధర్మ పరిపాలన చేయవలెను గదా.అంటూ.......

ఇంకా...........నాకు భిన్నము కాకపోయినను నీవు లోకసంగ్రహార్ధము ప్రాయశ్చిత్తము జరుపవలసియున్నది అంటూ ఇంకా......నీ తపస్సును వీక్షించి మానవులు ధర్మనిరతులై యుండుట నిశ్చయము అని ఎన్నో విషయములు చెబుతారు.

మహిషా సుర మర్ధన క్షేత్రం

పార్వతీదేవి తపస్సు చేస్తుండగా .......... ఆమె తపోమధ్యంలో మహిషాసురుడు విజృభించగా అంబ దుర్గా స్వరూపంలో మహిషుని సంహరించిన ఉదంతం అరుణగిరి సమీపాననే జరిగింది.

* పార్వతి మహిషాసురమర్ధనిగా ప్రఖ్యాతి జెందిన పరమ పవిత్ర క్షేత్రమీ అరుణాచలము.

బ్రహ్మ విష్ణు సంభంద కథ

ఇంకా, ఒకసారి బ్రహ్మ...విష్ణుమూర్తి మధ్యన చిన్న వాగ్వివాదం జరుగగా ఒక మహాలింగము వారిమధ్యన జ్యోతిస్థంభరూపమున వెలసెను.

బ్రహ్మదేవుడు లింగాగ్రభాగము కనుగొనుటకు హంస రూపమున వెళ్ళటము, విష్ణుమూర్తి వరాహరూపమున లింగము యొక్క అంత్యభాగమును కనుగొనుటకు ప్రయత్నించిన కధ తెలిసినదే .

ఆ మహాలింగము ఈ అరుణాచలలింగమేనని భక్తుల విశ్వాసము.

అరుణాచలం వేద, పురాణాలలో కొనియాడబడ్డ క్షేత్రము . అరుణాచలేశ్వర దేవాలయం శివజ్ఞచేత విశ్వకర్మచే నిర్మింపబడిందనీ , దాని చుట్టూ అరుణమనే పురము నిర్మింపబడినదనీ పురాణములు తెలుపుతున్నాయి. అక్కడ జరుగవలసిన పూజావిధానమంతా గౌతమ మహర్షి శివజ్ఞచేత ఏర్పాటు చేశరనీ స్కాందపురాణాంతర్గతమైన అరుణాచలమహాత్మ్యంతెలుపుతున్నది. ఈ కొండ శివుడని పురాణములు తెల్పుతుండటము చేత ఈ కొండకు తూర్పున గల అతిపెద్ద దేవాలయమైన అరుణాచలేశ్వరాలయము కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధన్య మీయబడుతున్నది. ఇది జ్యోతిర్లింగమని చెప్పు కొనబడుతున్నది. ఇది తేజోలింగము గనుక అగ్ని క్షేత్రమంటారు. ఈ అరుణాచలం పమేశ్వరుని జ్యోతిర్లంగ స్వరూపమే కావటంవలన దీనిని చుట్టి ప్రదక్షిణం చేయటం సాక్ష్తాత్తు శివునికి ప్రదక్షిణము అని భక్తుల విశ్వాసం.

గిరి ప్రదక్షిణం

గిరి ప్రదక్షణం ఈ అరుణాచలం పమేశ్వరుని జ్యోతిర్లంగ స్వరూపమే కావటంవలన దీనిని చుట్టి ప్రదక్షిణం చేయటం సాక్ష్తాత్తు శివునికి ప్రదక్షిణము అని భక్తుల విశ్వాసం. ,కంచిలో పుట్టడం, కాశీలో మరణించడం ఎలా ముక్తినిస్తాయో అలా అరుణాచలం గురించి ఆలోచిస్తే చాలు మోక్షం లబిస్తుందని విశ్వాసం.

అరుణాచల ఆలయ ప్రాంగణంలోని నైరుతిమూల ఉండే పాతాళలింగాన్నే రమణ మహర్షి ఆరాధించారు.శ్రీరమణులు దీని ప్రాముఖ్యాన్ని పదేపదే ఊద్ఘోషించి ఉన్నారు పాదచారులై శివస్మరణగవావిస్తూ ప్రదక్షిణ చేసేవార్కి మహాపుణ్య సిద్దిస్తుందని మహత్లుల వచనం. అందుచేత నిత్యమూ , అన్నివేళలా ఎంతోమంది గిరిప్రదక్షిణం చేస్తూ ఉంటారు. గిరిపైన గల మహౌషధీ ప్రభావం వల్ల శరీరమునకు, శివస్మరణవల్ల మనస్సుకూ, శివనుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్ధత చేకూరుతుంది . గిరిప్రదక్షణం చాల వరకు తారు రోడ్డు పైనే జరుగుతుంది. ఈ మధ్య కాలం లొ గిరిప్రదక్షణం చెయనికి వీలుగా రోడ్డు పక్కన పూట్ పాత్ కూడ వేసారు. ఎక్కువ మంది ఉయదయం సూర్యతాపన్ని తట్టుకోవడం కష్టం కనుక రాత్రి పూట లేద తెల్లవారుజామున చెస్తారు . రమణ ఆశ్రామానికి 2కి.మి దూరం వెళ్ళిన తరువాత కుడివైపుకు తిరగలి రోడ్ కి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది . అక్కడ మీరు కొండను చూస్తే మీకు నంది లాగా కనిపిస్తుంది .ఇక్కడి విశేషమేమిటంటే .. పంచభూతలింగాల్లో మిగతావైన ఏకాంబరేశ్వర, జంబుకేశ్వర, శ్రీకాళహస్తీశ్వర, చిదంబర లింగాల ఆలయాల నమూనాలను ఈ ప్రాంగణంలోని మూడోప్రాకారంలో దర్శించవచ్చు. అంటే.. అన్ని చోట్లకూ వెళ్ళలేని వారు ఒక్క అరుణాచలాన్ని దర్శిస్తే సరిపోతుందన్నమాట. ఇంక.. చిత్రగుప్తుడికీ ధర్మదేవతకూ కూడా ఆలయాలు ఉండటం ఇక్కడే చూస్తాం. ఇక్కడ అమ్మవారు ఉణ్ణామలై.

కార్తీక దీసోత్సవం
ఇక కార్తీక దీపోత్సవము........... తమిళుల కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రం ఉచ్చలో ఉన్నప్పుడు సంభవిస్తుంది. దీనికి .... తెలుగువాళ్ళ కార్తీక మాసమునకు ఒకోసారి వారం రోజులు లేక పదిహేను రోజుల తేడా ఉంటుంది.

కార్తీక దీపం ఏ తేదీన వచ్చేది  దేవస్థానం వాళ్ళు ముందే ప్రకటిస్తారు.

ఈ కార్తీకదీపోత్సవం సందర్భముగా తెల్లవాజామున భరణీ దీపం వెలిగిస్తారు. సాయంత్రమున కార్తీకదీపం వెలిగిస్తారు. కొండపైన అతి పెద్ద ప్రమిదలో దీపాన్ని వెలిగిస్తారు.

దీనికి కొన్ని కిలోల నెయ్యి వాడబడుతుంది. కొండమీద జ్యోతి, భక్తులు సమర్పించిన నేయి హరించుకు పోయేవరకు వెలుగుతూ ఉంటుంది.

ఈ దీపం చూసిన వారికి మోక్షము సిధ్ధిస్తుందని భక్తుల విశ్వాసము .

 కార్తీకదీపానికి నేయి ఇంకా అవసరమైన వాటికోసం డబ్బును భక్తులు దేవస్థానం వారికి పంపించవచ్చు.
ఈ కార్తీకదీపోత్సవం జరిగిన కొన్ని రోజుల తర్వాత ఆ దీప ప్రమిదలో మిగిలిన నల్లటి పదార్ధము చిన్న భరిణలో అమ్ముతారు, భక్తులు దానిని తెచ్చుకొని దేవుని బొట్టుగా పెట్టుకుంటారు.


రమణాశ్రమం

రమణాశ్రమం అరుణాచలేశ్వరాలయమునకు 2 కి.మి దూరం లో ఉంటుంది. అరుణాచలం(Arunachalam) వేళ్ళిన వాళ్ళు రమణాశ్రమాన్ని సందర్శిస్తూంటారు. అక్కడ అరవవాళ్ళకంటే అమెరికా వాళ్ళే ఎక్కువ కనిపిస్తారు మనకు . సాయంత్రం సమయం లో రమణాశ్రమంలో చెసే ప్రార్దన చాల బాగుంటుంది . రమణాశ్రమంలో రమణుల సమాధిని మనం చూడవచ్చు . రమణాశ్రమం(Ramana ashramam) లో కోతులు ఎక్కువగ మనకు కనిపిస్తాయి . నెమళ్ళు కూడ స్వేచ్ఛగా తిరుగుతూంటాయి . రమణాశ్రమం లో ఇంకా లక్ష్మి (ఆవు) సమాధి , కాకి సమాధి , శునకం యొక్క సమాధిని కూడ చూడవచ్చు . ఇవన్ని వరుసగా ఉంటాయి. అక్కడ గ్రంధాలాయంలో మనకు రమణుల గురించిన పుస్తకాలు లభిస్తాయి. మీరు ఆశ్రమంలో ఉండాలంటె మీరు ముందుగానె బుక్ చెసుకొవాల్సి ఉంటుంది.

శేషాద్రి స్వామి ఆశ్రమం


రమణాశ్రమం కంటే ముందే మనకు శేషాద్రి స్వామి అశ్రమం కనిపిస్తుంది. శేషాద్రి స్వామి సమాధి కూడ అక్కడే ఉంది. ఇక్కడ కూడ ఉండటానికి రూం లు ఉన్నవి. మీరు ముందుగానే రూం లను బూక్ చేసుకోవాల్సి ఉంటుంది.
చెన్నై నుంచి 185 కి.మి. దూరం లో కలదు. చెన్నై నుంచి బస్సు మరియు ట్రైన్ సౌకర్యం కలదు. చెన్నై లొని కోయంబేడు(సి.యమ్.బి.టి.) బస్సు స్టాండ్ నుంచి అరుణాచలం చేరుటకు 4-5 గంటల సమయం పడుతుంది.

ఈ క్షేత్ర సందర్శనంలో శ్రీ బివివి ప్రసాద్ గారిచే పోస్టు చేయబడిన ఫోటోలను ఇక్కడినుండి చూడండి

No comments:

Post a Comment