Pages

Tuesday 7 May 2013

యోగుల హృదయేశ్వరివి నీవు


ఇంద్రాణీ సప్తశతి - 29

ఇంద్రాణీ సప్తశతిలోని బార్హతం శతకంలోని నాలుగవదైన మాత్రసమక స్తబకం లోనిశ్లోకాలను తెలుసుకొందాం.
16. ఏతత్స్వాంతం హృదయా జ్ఞాతం
శీర్షే వాసం పృథగాధాయ
హార్దా హంతం స్వయమాక్రమ్య
భ్రాంతానస్మాన్కురుతే మాతః


17. అస్మాకం భోః కురుతే బాధా
మస్యజ్యోతిర్జనని ప్రాప్య
స్వాతే నైతత్కృత మన్యాయ్యం
కాంతే జిష్ణో శ్శృణు రాజ్ఞీ త్వం॥
స్వాంతేతేజో హృదయా దాయా
చ్చంద్రే తేజో దినభర్తుర్వా
ఆశ్రాంతం యో మనుతే ధీర
స్తన్య స్వాంతం హృదిలీనం స్యాత్‌॥
19.మూలానే్వషి స్ఫురదావృత్తం
నీచైరాయా త్కబళ కృత్య
జానం త్యేకా హృదయస్థానే
యుంజానానం జవలసీ శానే॥
అమ్మా! హృదయాన్నుండి పుట్టిన ఆ చిత్తం విడిగా శిరస్సులో వేరే కర్తగా ఉండి హృదయంలోని అహాన్ని ఆక్రమిస్తుంది. దానివల్ల మిమ్మల్ని భ్రాంతిలో ముంచుతున్నాయి. ఈ చిత్తం అనేది మా తేజస్సును పొంది మాకే అనేక బాధలు కలిగిస్తూ ఉంది. ఈ అన్యాయానికి మా మనస్సే కారణమవుతోంది. ఓ ఇంద్రాణీదేవీ విను. మా హృదయంలో ఉండే తేజస్సు మా మనస్సనే చంద్రుడికి సూర్యుని తేజస్సులాగా ఉంటోంది. ఇది తెలిసి ఎవడైతే నిత్యము తలుస్తూ ఉంటాడో, అతడి చిత్తం హృదయంలో లీనమైపోతోంది. ఆ చిత్తం హృదయంలో లీనమై, మూలాన్ని అనే్వషిస్తూ, మాటిమాటికీ స్ఫురిస్తూ, గ్రంధులన్నింటినీ కప్పివేసి కిందకు వస్తుంది. అంటువంటి యోగుల హృదయాల్లో నీవొక్కదానివై ప్రకాశిస్తావు.
20. శీర్షే చంద్రో హృదయే భాను
ర్నేత్రే విద్యు త్కులకుండేగ్నిః
సంపద్యంతే మహాసోంశైస్తే
జిష్మోః కాంతే సుతరాంశస్తే॥

21.మన్వానాం త్వాం శిరసి స్థానే
పశ్యంతీంవా నయన స్థానే!
చేతంతీంవా హృదయస్థానే
రాజంతీవా జ్వలనం స్థానే॥
22. యోనా ధ్యాయే జ్జగతాం మాతః
కశ్తిచ్ఛ్రేయానవనౌ నాతః
పూతం వంద్యం చరణం తస్య
శ్రేష్ఠం వర్ణ్యం చరితం తస్య॥
అమ్మా! శిరస్సులో చంద్రుడు, హృదయంలో సూర్యుడు, కళ్లల్లో విద్యుత్తూ, కుండలినీలో ఉండే అగ్ని- ఇలా అన్నీ కూడా నీ తేజస్సుకు చెందిన అంశలనే కలిగి ఉన్నాయి. శీర్ష స్థానంలో నిన్ను ఆలోచనా రూపంగానూ, కళ్ల స్థానంలో చూపుగానూ, హృదయ స్థానంలో ఉండే చైతన్యంగానూ, కుండలినీ స్థానంలో దీపంగానూ ఎవరైతే నిన్ను ధ్యానించే వారు అత్యంత శ్రీమంతుడు. అతనికంటే శ్రీమంతులెవరూ ఈ లోకంలో ఉండరు. అతడి పాదం పవిత్రమై పూజ్యార్హమవుతుంది. అతడి చరిత్ర మిక్కిలి శ్రేష్ఠమై వర్ణించడానికి అర్హమవుతుంది.
23. దోగ్ధ్రీం మాయాం రసనాంవా యో
మంత్రం మాత ర్జపతి ప్రాజ్ఞః!
సోయం పాత్రం కరుణాయాస్తే
సర్వం కామ్యం లభతే హస్తే॥
ఓ తల్లీ! మాయా బీజమైన (హ్రీం అనేది మాయా బీజం), దోగ్ధ్రీ బీజమైనా (హూం అనేది దోగ్ద్రీ బీజం), రసనా బీజమైన (క్రీం అనేది రసనా బీజం)- ఏదైనా సరే ఎవడైతే మంత్ర సహితంగా జపిస్తాడో అతడు నీ కరుణకు పాత్రుడవుతున్నాడు. అతనికి సకల కార్యాలూ సిద్దిస్తాయి.
24. ఛిన్నాంభిన్నాం సుతరాంసన్నా
మన్నా భావాదభితః ఖిన్నాం!
ఏతాంపాతుం భరత క్షోణీం
జాయేజిష్ణోః కురుమాం శక్తః॥
ఓ తల్లీ! ఛిన్నా భిన్నమైపోతూ, కృశించిపోతూ, అన్నమే లేకుండా సదా దుఃఖిస్తూ ఉన్న ఈ భారతభూమిని రక్షించే శక్తినివ్వు.
25. క్లుపె్తై స్సమ్యగ్బృహతీ ఛంద స్యే
తై ర్మాత్రాసమకై ర్వృతె్తైః
కర్ణ్ధ్వానం ప్రవిశద్భి స్సా
పౌలోమ్యంబా పరితృప్తస్తు॥
చక్కగా రచించిన బృహతీ ఛందస్సును కలిగిన మాత్రా సమక వృత్తాలు ఇంద్రాణీదేవి చెవులకు సోకి ఆమెకు తృప్తినిచ్చుగాక!
బార్హతం శతకంలోని నాలుగవదైన మాత్రసమక స్తబకం ఇక్కడితో పూర్తి అయింది.
దీనితో ఇంద్రాణీ సప్తశతిలోని నాలుగవదైన బార్హతం శతకం పూర్తి అయింది.

  • వి.వి. వేంకట రమణ సెల్. 9441234429
  •  
  • 11/03/2013
    ఆధారం : 
http://www.andhrabhoomi.net/content/indrani

No comments:

Post a Comment