Pages

Tuesday 7 May 2013

విశ్వనాయక శచీదేవి.. (ఇంద్రాణీ సప్తశతి 22)

ఇంద్రాణి సప్తశతిలోని మూడవదైన అనుష్ట్భు శతకం లోని మిగిలిన శ్లోకాలను చూద్దాం.

13. ధర్మే పరిక్షయం గతే యా విశ్వ నిర్మలం జనం
తద్రక్షణాయ జాయతే సా విశ్వనాయికా శచీ॥

14. వేధా ఋతస్య యోదితా మంత్రేణ సత్యవాదినా
బాధా నివారణీ సతాం సా విశ్వనాయికా శచీ॥
ధర్మం నశిస్తూ ఉన్నుప్పడు ఏ దేవతైతే సాధుజనులను రక్షించడానికై అవతరిస్తుందో, ఆ విశ్వనాయికయైన శచీదేవి ప్రకాశించుగాక! సత్యాన్ని పలికే మంత్రంవల్ల వచ్చే మానసిక సత్యానికి ఏ దేవియైతే సృష్టికర్త్రిగా కీర్తిని పొందుతోందో, సత్పురుషుల బాధలను నివారించే విశ్వనాయికయై ఆ శచీదేవి ప్రకాశించుగాక!
(ఋతమంటే మానసిక సత్యమని అర్థం. మంత్రం అనేది మస్సుకు సంబంధించింది. మంత్రం ఆపాదించే ఋతమనేది అనిర్వచనీయ సత్యాన్ని నిరూపిస్తుంది. అటువంటి ప్రతి రూపాన్ని సృష్టించింది శచీదేవి)

15. యజ్ఞో యయా వినీయతే యుద్ధం తథా పృథగ్విధం
తాం దేవరాజ మోహినీం నారీం నుమఃపురాతనీం॥

16. యస్యాస్సుతో వృషాకపి ర్దేవో సతాం ప్రశాసితా
తాం సర్వదా సువాసినీం నారీం నుమః పురాతనీం॥

17. యస్యస్సమా నితంబినీ కాచిన్న విష్టపత్రయే
తాం నిత్యచారు వనాం నారీం నమః పురాతనీం॥
ఎలాగైతే, యజ్ఞాలను చేయించడానికి దేవి కారణమవుతోందో, మరొక రీతిలో యుద్ధాలు జరగడానికీ ఆమె కారణమవుతోంది. ఇంద్రుడినే మోహింపజేసే దేవత ఆమె. దేవుడైన వృషాకపి ఏ దేవతకు పుత్రుడై సత్పురుషులను రక్షిస్తూ ఉన్నాడో ఆ సర్వకాలవాసినికి సమానమైన స్ర్తి ఈ ముల్లోకాలలోనే లేదు. అటువంటి సుందరీ, నిత్య వనీ, పురాతనీయమైన ఆమెకు మేము నమస్కరిస్తాం

18. యచ్చారుతా సదృశ్యతే మందార పల్లవేష్వపి
తత్సుందరాచ్చ సుందరం శచ్యాః పదాంబుజంశ్రయే॥

19. యస్యప్రభా నవిద్యతే మాణిక్య తల్ల జేష్వసి
తద్భాసురాచ్చ భాసురం శచ్యాఃపదాంబుజంశ్రయే॥

20. నస్యాదఘై స్తిరస్కృతో యచ్చింతకోనరఃవికృతీ
తత్పావనాచ్చ పావనం శచ్యాః పదాంబుజంశ్రయే॥
మందార పల్లవాలకు కూడా లేని సౌందర్యం ఏదేని పాదాలకు ఉందో అటువంటి సుందరాతి సుందరమైన శచీదేవి పాదాలను నేను శరణుకోరతాను. ఆ దేవి పద కాంతులు ప్రశస్తమైన మాణిక్యాలకు కూడా ఉండవు. స్ఫటికాలకన్నా స్వచ్ఛంగా ఉండే ఆ శచీదేవి పాదాలనే నేను శరణు వేడతాను. ఏ దేవి పాదాలను విస్మరిస్తే నరుడు పాపాలనుంచి బయటపడలేడో, అటువంటి పవిత్రమైన పాదాలకన్నా పవిత్రమైన పాదాలు కలిగిన ఆ శచీదేవి పాదాలనే నేను ఆశ్రయిస్తాను.

21. రాజన్నఖేందు భానుభి స్సర్వం తమో విధున్వతే
బృందార కేంద్ర సుందరీ పాదాంబుజాయ మంగళం॥

22. గీర్వాణవౌళి రత్న భా సంక్షాళితాయ దీప్యతే
స్వర్గ్ధానాధ భామినీ పాదాంబుజాయ మంగళం॥

23. బాలార్క బింబ రోచిషే యోగీంద్ర హృద్గుహాజుషే
పాకారి జీవితేశ్వరీ పాదాంబుజాయ మంగళం॥
ఏ దేవి వేలి గోళ్లు వెదజల్లే చంద్రకాంతులు చీకటిని (అజ్ఞానాన్ని, పాపాన్ని) పారద్రోలుతున్నాయో, అటువంటి ఇంద్రాణీదేవి పాదాలకు మంగళమగుగాక! దేవతల కిరీటాల్లో ఉండే రత్నాల కాంతులు ఆ దేవి పాదాలను కడగటంవల్ల మరింతగా ప్రకాశిస్తూ ఉన్న ఇంద్రాణీదేవి పాదాలకు మంగళమగుగాక! ఉదయభానుడి బింబంలా వెలుగుతూ, యోగీంద్రుల హృదయాలలో వెలుగు నింపుతూ ఉన్న ఆ ఇంద్రాణీదేవి పాదపద్మాలకు మంగళమగుగాక!

24. ఆత్మీయ దేశ రక్షణే శక్తం కరోతు సర్వథా
పాప ద్విషాం ప్రియంకరీ వాసిష్ఠ మింద్ర సుందరీ॥
పాపాలకు శత్రువులైన వారికి సంతోషాన్నిచ్చే ఓ ఇంద్రాణీదేవీ! నీవు ఆత్మీయ దేశమైన భారతదేశాన్ని రక్షించడంలో వాసిష్ఠ గణపతి మునిని ఎల్లపుడూ శక్తిమంతుని చేయి.
25. వాసిష్ఠ వాక్ప్రదీప్త్భిర్నా రాచికాభి రీశ్వరీ
గీర్వాణ చక్రవర్తిన స్సమ్మోద మేతు సుందరీ॥
ఈశ్వరియైన ఇంద్రాణీదేవి ఈ వాసిష్ఠ (గణపతిముని) వాక్కులతో ప్రకాశించే ఈ నారాచికా వృత్తాలవల్ల సంతోషాన్ని పొందుగాక!
అనుష్ట్భ శతకంలోని నాలుగవదైన నారాచిక స్తబకం ఇక్కడితో పూర్తి అయింది.
దీనితో ఇంద్రాణి సప్తశతిలోని మూడవదైన అనుష్ట్భు శతకం పూర్తి అయింది.
ఇక బార్హతం శతకమ్ చూద్దాం. ఇది ఇంద్రాణీ సప్తశతిలో నాలుగవ శతకం. హాలముఖీ, భుజగశిశుభృతా, మణిమధ్యా, మాత్రసమక అనే నాలుగుస్తబకాలున్నాయ. ఇందులో మొదటిదైన హలముఖీస్తబకం చూద్దాం. హాలముఖీస్త్తబకం

1. క్షీరవీచి వృషతసితం ప్రేమధారి దరహసితం
నాకరాజ నళిని దృశ శ్శోకహారి మమ భవతు॥
పాల తరంగాల బిందువుల్లాగా స్వచ్ఛమైన ప్రేమను కలిగిన ఇంద్రాణీదేవి చిరునవ్వు నా శోకాన్ని హరించుగాక!

2. అధ్వనో గళిత చరణా మధ్వర క్షితి మవిభవాం
ఆ దధాతుపథి విమలే వైభవేచ హరి తరుణీ॥
నడుస్తున్న దారినుండి అడుగులు జారి, వైభవాన్ని కోల్పోయిన ఈ యజ్ఞ్భూమిని తిరిగి దారిలోకి తెచ్చి, ఆ వైభవాన్ని కూడా ఇంద్రాణీదేవి తిరిగి తెచ్చుగాక!

3. బ్రహ్మణ శ్చితి రథ నభఃకాయభా గవగతి మతీ
యా తదా పృథగివ బభౌ ధర్మితాం స్వయమపి గతా॥
బ్రహ్మకు చైతన్యమై, ఆ తరవాత ఆకాశశరీరిణిగా ఉండి సర్వత్రా గమనాన్ని కలిగిన ఆ దేవి చిత్ తత్త్వాన్ని స్వయంగా పొంది ఉన్నా కూడా వేరేగా (విద్యుత్ రూపిణిగా) ప్రకాశిస్తూ ఉంది.

No comments:

Post a Comment